నాయుడుపేటలో 12 టెక్స్‌టైల్ మిల్లులు
2006 నవంబర్ 09 : నెల్లూరుజిల్లా నాయుడుపేటలో రెండు భారీ టెక్స్‌టైల్‌పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి.తమిళనాడుకి చెందిన 12 వస్త్ర కంపెనీల ఆధ్వర్యవంలో 12 మిల్లులు స్థాపించబోతున్నారు.ఈ మేరకు ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.ఆర్.సమక్షంలో గురువారం నాడు హైదరాబాదులో ఆయా కంపెనీల ప్రతినిధులు అవగాహన పత్రాల(MoU)పై సంతకాలు చేశారు.
ఈ పార్కుల్లో ఒకదాన్ని కోయంబత్తూరుకి చెందిన Southern India Mills' Association రూ.1400 కోట్ల పెట్టుబడితో 650 ఎకరాల్లో ఏర్పాటు చెయ్యబోతోంది.అందులో 11 వస్త్ర సంస్థలు తమ జౌళి మిల్లుల్ల్ని ప్రారంభిస్తాయి.చెన్నైకి చెందిన Loyola Textile Mills Limited కూడా రూ.100 కోట్ల పెట్టుబడితో 150 ఎకరాల్లో మరో పార్కు ఏర్పాటు చెయ్యబోతోంది.ఈ రెండు పార్కుల్లోను స్పిన్నింగు నేత మరియు రెడీమేడు దుస్తుల (apparels)తయారీ యూనిట్లు నెలకొని ఉంటాయి.
ఈ పార్కుల ఏర్పాటుతో 16 వేలమందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.కాని తమిళనాడుకి చెందిన సంస్థలు ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నాయుడుపేటనే ఎంచుకోవడం తమిళనాడువారికే లాభిస్తుంది గాని రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనమేదీ లేదనే వాదన కూడా వినిపిస్తోంది.ఉద్యోగుల్ని కూడా చెన్నై నుంచే దిగుమతి చేసుకునే అవకాశం ఉందని తెలుగువారికి అవకాశం ఇవ్వకపోవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు.

0 Comments:
Post a Comment
<< Home